ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. ఇమామ్‌కు ఆర్‌&ఆర్ పరిహారం

19-09-2026 | 11:22am

సత్తుపల్లి, సెప్టెంబర్ 19: సింగరేణి భూసేకరణ(Singareni Land Acquisition)లో ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాల కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న కొమ్మేపల్లి మసీదు.. ఇమామ్ మహమ్మద్ ముంతాజ్ అన్సారీకి ఎట్టకేలకు తనకు ఆర్‌&ఆర్ పరిహారంతో పాటు ఇంటి స్థలం మంజూరైంది. తన అర్హతను ఆర్‌టీఐ సమాచారంతో నిరూపించి, పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో సామాజిక కార్యకర్త యాదాల శ్రీనివాస్ సహకరించారని.. ముంతాజ్ అన్సారీ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇదిలా ఉండగా, 2016లో 258 మందిని అర్హులుగా గుర్తించినప్పటికీ 29 మంది పేర్లు తొలగించడంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో ప్లాట్ల ఆక్రమణలు, అధికారుల వ్యవహారశైలిపై గ్రామస్తులు చేసిన ఆరోపణలపై విచారణ కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు