calender_icon.png 2 December, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

02-12-2025 04:36:56 PM

ఎన్నికల ప్రక్రియకు సిబ్బంది కేటాయింపు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయం పర్యవేక్షణలో ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ జరిగింది. మొదటి విడతలో 6 మండలాల 1,326 పోలింగ్ కేంద్రాలకు 3,502 మంది, రెండో విడతలో 7 మండలాల 1,412 పోలింగ్ కేంద్రాలకు 4,106 మంది పిఓ, ఓపిఓలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి విడతకు 20% అదనపు సిబ్బందిని కూడా సిద్ధం పెట్టామని, అన్ని సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తయ్యిందని అధికారులు పేర్కొన్నారు.