విద్యుత్తు ఉత్పత్తి అంతంతే!
- స్థాపిత సామర్థ్యం పెరిగినా.. పెద్దగా ఫాయిదా లేదు
- గతేడాదితో పోలిస్తే జెన్‌కో ఆధ్వర్యంలో తక్కువ ప్రొడ్యూస్
- థర్మల్‌కు బొగ్గు తిప్పలు.. జల విద్యుత్‌కు ఎల్ నినో కష్టాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 2౬ (విజయక్రాంతి): ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లు తయారవుతున్నది రాష్ట్రంలో విద్యుత్తు రం గం పరిస్థితి. ఈ సెక్టార్ రోజు రోజుకూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మా త్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారి క గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో విద్యు త్తు రంగం ముందుకు సాగుతున్నదా? లేక వెనకడుగు వేస్తున్నదా?.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంతో.. తాజా ఆర్థిక సంవత్సరం (20 26 పోల్చి చూస్తే ఇది అర్థమవుతుం ది.
థర్మల్ స్థాపిత సామర్థ్యం పెరిగినా..!
2025 రాష్ట్రంలో థర్మల్ విద్యు త్తు స్థాపిత సామర్థ్యం 6,380 మెగావాట్లు. అదే 2026 ఈ సామర్థ్యం కాస్తా.. 7,180 మెగావాట్లకు చేరుకుంది. అంటే ఒక సంవత్సరంలో సుమారు 800 మెగావాట్ల సామర్థ్యం పెరిగిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే సామర్థ్యం పెరిగినప్పటికీ.. అదే స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి మా త్రం పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా ఎల్ నినో పుణ్యమాని జల విద్యుత్తు ఉత్పత్తికూడా పడకేసింది. కృష్ణా నదిలో వరద లేకపోవడం, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు ఖాళీ కుండలను తలపి స్తుండటంతో.. పూర్తిస్థాయిలో జల విద్యుత్తు ఉత్పత్తి కూడా జరగడం లేదు.
జూలైలో థర్మల్, జల వి ద్యుత్తు కలిపి మొత్తం 3,183.32 మిలియన్ యూనిట్లను తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో ని థర్మల్, జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రా లు ప్రొడ్యస్ చేశాయి. అదే 2026 జూలైలో కేవలం 2,770.07 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి చేశాయి. ఈ సంవత్సరం జల విద్యుత్తు ఉత్పత్తి చాలా తగ్గిపోయింది.
పోలిస్తే ఈసారి థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం పెరిగింది. కానీ, ఆ స్థాయిలో ఉత్పత్తి మాత్రం పెరగలేదు. గతేడాది జూలైలో 2,225.10 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయగా.. ఈయేడు (2026 జూలైలో 2,672.67 మిలియన్ యూనిట్లు ఉత్ప త్తి చేశారు. అలాగే గతేడాది ఆగస్టులో 2292.49 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అవ్వగా.. ఈయేడు ఆగస్టులో 2,880.17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. పేరుకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్లు కనిపిస్తున్నా అది స్థాపిత సామర్థ్యానికి తగ్గట్టుగా లేదని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) పెంచకపోవడమేనని అంటున్నారు.
పీఎల్‌ఎఫ్ తక్కువ..!
థర్మల్ విద్యుత్తు విషయంలో.. 2025 26లో సగటున 57 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో కరెంట్‌ను ఉత్పత్తి చేశారు. అదే 2026 ఆగస్టు వరకు చూసుకుంటే.. కేవలం 63 శాతం సగటు పీఎల్‌ఎఫ్‌తో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నడిపిస్తున్నారు. వాస్తవానికి జల విద్యుత్తు ఉత్పత్తి పడకేసిన నేపథ్యంలో కనీసం 70 శాతం వరకు పీఎల్‌ఎఫ్‌తో థర్మల్ వి ద్యుత్తు ఉత్పత్తి చేయగలిగితే రా ష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉం టుందని విద్యుత్తు రంగ నిపుణులు సూచిస్తున్నారు. అయితే సింగరేణి సరఫరా చేసే బొగ్గు నాణ్యత తక్కువగా ఉండటంతో యా దాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం మూలుగుతున్నదని వారు అంటున్నారు.
యాదాద్రి థర్మ ల్ విద్యుత్తు కేంద్రంలోని మొదటి యూనిట్ ఇప్పటి వరకు కేవలం 25.04 పీఎల్‌ఎఫ్‌తోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడం గమనా ర్హం. ఇది రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లోనే అతి తక్కువ పీఎల్‌ఎఫ్. అలాగే మిగతా థర్మల్ విద్యుత్తు కేంద్రాలన్నీ.. సగటున 65 పీఎల్‌ఎఫ్ సామర్థ్యంతో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంటే.. యాదాద్రిలోని అన్ని యూనిట్లు కలుపుకుని 33 నుం చి 35 పీఎల్‌ఎఫ్‌తోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థాపిత సామ ర్థ్యం పెరిగినప్పటికీ.. అదే స్థాయిలో ఉత్పత్తి పెరగడం లేదు.
సౌర విద్యుత్తులో వెనక్కి..!
సౌర విద్యుత్తు ఉత్పత్తిలో రాష్ట్రం చాలా వరకు వెనుకబడి ఉన్నట్టుగానే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విద్యుత్తు శాఖలు వెల్లడిస్తున్న లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణలో మొత్తం (సౌర, పవన, బయో, వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి) రెన్యువబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యం 8030.62 మెగావాట్లు. 2025 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 5781.06 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4608.23 మిలియన్ యూనిట్లు మాత్రమే రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అయినట్టు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ ధరకు కొనుగోళ్లు!
థర్మల్ విత్యుత్తు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగకపోవడం.. ఇటు జల విద్యుత్తు పడకేయడంతో మరో దారి లేక బహిరంగ మార్కెట్లో భారీ ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తున్నది. 2025 జూలైలో మొత్తం 3341.97 మిలియన్ యూనిట్లు, ఆగస్టులో 2622.74 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. అదే 2026 జూలై, ఆగస్టులో వరుసగా.. 4131.61 మిలియన్ యూనిట్లు, 4236.66 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఇదికూడా యూనిట్‌కు సుమారు రూ. 8 నుంచి 10 వరకు చెల్లించి. కొన్నిసార్లు అది రూ. 12 వరకు కూడా చేరినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర జెన్‌కోపై అదనపు భారం పడుతున్నది.
