యూపిఐపై చార్జీల దోపిడీ - పేదోడి జేబు కొట్టే కుట్ర

16-09-2026 | 07:42pm

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఫైర్

ఖమ్మం, విజయక్రాంతి: సామాన్యుడు డిజిటల్ పేమెంట్(Digital Payment) చేస్తే కూడా చార్జీల పేరుతో దోచుకోవాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు దారుణమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్(District Congress Committee President Nuthi Satyanarayana Goud) ధ్వజమెత్తారు. కొత్తగా యూపిఐ పేమెంట్లపై చార్జీలు వసూలు చేయాలని కేంద్రం యోచిస్తుండటంపై ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నోట్ల రద్దుతో మొదలుపెట్టి డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పి, ఇప్పుడు అదే డిజిటల్ లావాదేవీలపై చార్జీల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల రక్తం తాగాలని చూస్తోందన్నారు. టీ కొట్టు, కూరగాయల బండి దగ్గర కూడా 10 రూపాయలు యూపిఐ చేస్తే చార్జీ కట్టాలా? ఇది దోపిడీ కాదా? అదే విధంగా నాడు నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్ లో వేస్తామని మోసంచేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు