కడ్పల్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
01-10-2026 | 06:59pm
- రైతులను సమాధానయించిన డిఈ శ్రీనివాస్
- సకాలంలో విద్యుత్ సరఫరా అందిస్తామని అధికారుల హామీ
సిర్గాపూర్ అక్టోబర్ 01(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలోని(Kadpal village) విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గురువారం స్థానిక రైతులు ముట్టడించారు. పంటలకు సక్రమంగా నిరంతర విద్యుత్ సరఫరా (Power supply)చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నాణ్యమైన
విద్యుత్‌ను అందించాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న డీఈ శ్రీనివాసులు డివిజన్, ఏడి నాగిరెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు.