మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌కు సన్మానం

12-09-2026 | 07:02pm

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అభినందనలు

మంథని, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్‌(Manthani Municipal Chairperson)గా ఎన్నికైన వొడ్నాల శ్రీనివాస్‌ను పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని రాజమౌళిలో ఉన్న పద్మశాలి భవన్‌లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్‌ను సంఘం నాయకులు, పద్మశాలి కుల బాంధవులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక సేవలో ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వీరభద్ర అనిల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ గూడెం వెంకటరమణ, ఎల్. రమణ, గుండు సుధారాణి, పెద్దపల్లి జిల్లా చైర్మన్ వలస నీలయ్య, మాజీ సర్పంచ్ మేముని వెంకటేశ్వామి, సర్పంచ్ నాగుల రాజయ్య, మాజీ సర్పంచ్ రామ్ రామ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై  శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన పద్మశాలి సంఘం నాయకులకు, కార్యక్రమానికి హాజరైన కుల బాంధవులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు