30-08-2025 08:19:51 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలోని 500 ఎకరాల పెద్ద చెరువు కట్ట తెగిపోవడం జరిగింది. పంట పొలాలలోకి నీరు వరదల ప్రవహించడంతో పోలాలు పూర్తిగా ఇసుకతో కప్పబడి వాగును తలపిస్తున్నాయి. వరద దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు అరచేతుల ప్రాణాలు పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ గడిపారు. వర్షం ప్రభావానికి గ్రామంలోని 15 ఇల్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు.
అధికారులు తమ గ్రామాన్ని సందర్శించాలని టీజెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా:నిజ్జన రమేష్ కోరారు. జిల్లా కలెక్టర్ రావడం వలన స్థానిక సమస్యలు తెలుస్తాయని అన్నారు గ్రామానికి బ్రిడ్జి, తెగిపోవడం వలన రాకపోకలు బందు అయ్యాయి చెరువు కట్టను వెంటనే నిర్మించాలని కోరారు అధికారులు చెరువు కట్ట పనులు త్వరగా పూర్తిచేస్తే తప్ప రాబోవు వర్షాలకు తమ చెరువులో నీరు నిలువ ఉండదని అన్నారు లేనియెడల రెండు కళాల పంటలను నష్టపోతామని అన్నారు. స్పెషల్ ప్యాకిజీ ప్రకటించి ఆదు కోవాలని అన్నారు.