ఎట్టకేలకు జూరాల నీళ్లు!

24-09-2026 | 05:25am
  1. కొట్లాడి సాధించుకున్న రైతన్నలు
  2. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

గద్వాల్, సెప్టెంబర్ 23: జూరాల ఆయకట్టు(Jurala Ayacut) రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం సాగునీటి(irrigation water) విడుదలకు చర్యలు చేపట్టింది. బుధవారం ఉదయం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala Project) కుడి, ఎడమ కాలువల తూములను తెరిచి సాగునీటిని విడుదల చేశారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయ న్న ఆందోళనలో ఉన్న రైతులకు కొంత ఊ రట లభించింది.

సాగునీటి విడుదల కోసం గత కొద్ది రోజులుగా ఆయకట్టు రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు(BJP and BRS leaders) రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలవడంతో జూరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటలను కాపాడేందుకు వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 

కర్ణాటకతో నీటిపై చర్చలు 

రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూరాల నీటి పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా కు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో నీటి అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఆల్మట్టి నుంచి నీటి విడుదల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. 

2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం సుమారు 2,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తు న్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని కాలువలకు నీటిని విడుదల చేసినట్లు సమాచారం. సాగునీరు అందడంతో పంటలను కాపాడుకునే అవకాశం ఏర్పడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు