మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా
సమాచారం ఇచ్చిన వారికి రూ.10 వేల నజరానా
తరిగొప్పుల, సెప్టెంబర్ 7, (విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో గ్రామస్థులు , గ్రామ పంచాయతీ పాలక వర్గం సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం సర్పంచ్ కావటి సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కావటి సుధాకర్ మాట్లాడుతూ గ్రామంలో బెల్టుషాపులను పూర్తిగా మూసివేయాలని, మద్యం విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యహరించడంతో పాటు రూ.50 వేల జరిమానా విధించిడం జరుగుతుందన్నారు. గ్రామంలో మద్యం విక్రయాల గురించి తగిన ఆధారాలతో సమాచారాన్ని అందజేసిన వారికి రూ.10వేల నజరానా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. మద్యపానంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం తాగి వీధుల్లో అల్లర్లు చేసే వారిపై సైతం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకరవ్గం సభ్యులు నీల కనకరాజు, బీఆర్‌ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కృష్ణంరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలగోని శ్రీను, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు భాషబోయిన సుధాకర్ ,గ్రామపెద్దలు భాష బోయిన రమేష్, సిద్దిరాజు, బాల కుమార్, కనకరాజు, రమేష్, పాల్గొన్నారు.
