వినాయక మండపం వద్ద ముస్లిం సోదరుల అన్నదానం

19-09-2026 | 12:51pm

బెజ్జూర్ సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ కాలనీలో(Golconda Colony) సాయి గణేష్‌ వినాయక మండపం వద్ద ముస్లిం సోదరులు అన్నదానం నిర్వహించారు. తాజుద్దీన్,అమీర్‌ఉద్దీన్‌, ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. కులమత భేదాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలనే సందేశాన్ని చాటారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొని ముస్లిం సోదరుల సేవలను అభినందించారు.ఐక్యత,సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు