రామ్ సేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం
19-09-2026 | 11:54am
సిర్గాపూర్ సెప్టెంబర్ 18(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్(Sirgapur) మండల పరిధిలోని కడ్పల్ గ్రామం రామ్ సేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భక్తులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామ్ సేన యూత్ గణేష్ మండలి సభ్యుల ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. రామ్ సేన యూత్ గణేష్ మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, కిష్ట రెడ్డి, లక్ష్మ రెడ్డి, అనత్ రెడ్డి, విట్టల్ రెడ్డి, జైపాల్, రామ్ సేన యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.