ఫ్రెషర్స్‌కు ఘన స్వాగతం

09-09-2026 | 01:14am

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

మహమ్మాదాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) మహమ్మాదాబాద్‌లో మంగళవారం ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ స్వాగత సభను ఏర్పాటు చేసి, వారిని ఉత్సాహంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా షష్ట్యాబ్ది స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాటలు, నృత్యాలు తదితర ప్రదర్శనలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భీమ్‌రెడ్డి, సర్పంచ్ రాంలాల్, ఉపసర్పంచ్ పవన్, విజయానంద్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు