ఫిట్‌నెస్ నుంచి మైండ్‌ఫుల్ లివింగ్

10-09-2026 | 04:00am

హైదరాబాద్‌లో ప్రత్యేక వెల్‌నెస్ అనుభవం

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): వేగవంతమైన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, డిజిటల్ స్క్రీన్లతో గడిపే సమయం అధికమవుతున్న నేపథ్యంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, ఫిట్నెస్, మైండ్‌ఫుల్ లివింగ్, సెల్ఫ్‌కేర్, క్రియేటివిటీ అంశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లో ప్రత్యేక వెల్‌నెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. గచ్చిబౌలిలోని డీసెంట్ సరాయ్ పూ ల్‌సైడ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొన్నారు.

ది క్రియేటివ్ సోషల్(The Creative Social) వ్యవస్థాపకురాలు ఐశ్వర్య వర్మ(Aishwarya Varma) మాట్లాడుతూ.. నేటి జీవనశైలిలో చాలామంది తమ ఆరోగ్యాన్ని, మానసిక ప్ర శాంతతను నిర్లక్ష్యం చేస్తున్నారు. వెల్నెస్ అనేది కేవలం వ్యాయామం లేదా డైట్ మాత్రమే కాదు. మనసు, శరీరం, భావోద్వేగాలు, జీవనశైలి మధ్య సమతుల్యతను సాధించడమే అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఫిట్నెస్, పర్సనల్ కేర్, హోలిస్టిక్ వెల్నెస్ అంశాలపై అవగాహన కల్పించారు. ఉరాసి ఏస్తెటిక్స్, వెల్నెస్ సెంటర్, కొకాపేట్, పిలాటిస్, బియాండ్, గచ్చిబౌలితో పాటు వెల్నెస్, బ్యూటీ, ఫిట్నెస్, పర్సనల్ కేర్ రంగాలకు చెందిన పలు సంస్థలు తమ ఉత్పత్తు లు, సేవలను ప్రదర్శించాయి.

మరిన్ని వార్తలు