నిఘా నీడలో గణేష్ శోభాయాత్ర
సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
రాజన్న సిరిసిల్ల 25సెప్టెంబర్ (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతున్న గణేష్ శోభాయాత్రను(Ganesh Procession) జిల్లా పోలీసులు(District Police) కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల(CCTV cameras) ద్వారా శోభాయాత్రను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలు(Traffic problems), ఇతర ఇబ్బందులు తలెత్తకుండా వైర్‌లెస్ ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. శాంతిభద్రతలకు(Law and order) ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.