7 September, 2026 | 7:18 AM

హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం

07-09-2026 | 05:40am

జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే మార్గమని.. చరిత్ర అదే చెబుతుందని.. ప్రస్తుతం అమలులో ఉన్న హక్కులు ఎన్నో పోరాటాలు.. ఎంతో మంది అమరుల త్యా గాల ఫలితంగానే సాధించుకున్నామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్(AITUC National General Secretary Amarjeet Kaur) తెలిపారు.

కార్మికులు సాధించకున్న హక్కులను, చట్టాలను కాలరాసే పనిలో దేశంలోని పాలకులు ఉన్నారని అందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు కరీంనగర్‌లో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. బహిరంగ సభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ యూసుప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ హాజరై ప్రసంగించారు. 

సైమన్ కమిషన్, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లోను ఏఐటీయూసి పాత్ర మరువ లేనిదని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై రాజీ లేకుండా పోరాటాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఇంకా సభలో సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి బాలరాజు తదితరులు ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలఆహ్వాన సంఘం ప్యాట్రన్ కలవేన శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు