ఘట్‌కేసర్-కాజీపేట మల్టీట్రాకింగ్
- దేశంలో రూ.20,804 కోట్లతో 8 రైల్వే ప్రాజెక్టులు
- తెలుగు రాష్ట్రాలు సహా 9 రాష్ట్రాల్లో విస్తరణ
- మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశవ్యాప్తంగా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సహా 9 రాష్ట్రాల్లో రైలు మార్గాల అనుసంధాన ప్రాజెక్టులకు(Railway connectivity projects) కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్(Central government green signal) ఇచ్చింది. మొత్తం రూ.20,804 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. వీటిలో ఐదు ప్రాజెక్టులు దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అలాగే మిగతా మూడు ప్రాజెక్టులు తూర్పు, మధ్య భారత్‌లోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.
తెలంగాణలో ఘట్కేసర్- -కాజీపేట మధ్య 110 కి.మీ మేర మల్టీట్రాకింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో ఢిలీ-హౌరా, హౌరా-ముంబై, ఢిల్లీ--ముంబై, ఢిల్లీ--గువా హటి, ఢిలీ-చెన్నై, హౌరా--చెన్నై, ముంబై--చెన్నై మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను నాలుగు లైన్లకు పెంచనున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. రైల్వేల విస్తరణ ప్రయాణికులతో పాటు సరకు రవాణా సులభతరం చేయడానికి సహాయపడతాయి.
వీటి ద్వారా దాదాపు కోటి మందికిపైగా ప్రయోజనం కలుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ()Prime Minister Narendra Modi) అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(Cabinet Committee on Economic Affairs) (సీసీఈఏ) దేశంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రాష్ట్రాల్లోని రూ.20,804 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 1,196 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ ప్రాజెక్టుల ద్వారా రైలు అనుసంధానం (కనెక్టివిటీ) మెరుగుపడటంతో పాటు, ప్రస్తుత మార్గాల్లో రద్దీ తగ్గి ప్రయాణికులు, సరుకుల రవాణా వేగవంతం కానుంది.
ఈ ప్రాజెక్టులను 2029- నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు ‘కనెక్టివిటీని పెంచడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని, సరుకులు, ప్రయాణికుల రవాణాను వేగవంతం చేస్తాయని’ ప్రభుత్వం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఐదు ప్రాజెక్టులు 17 జిల్లాల గుం డా వెళ్తూ, 2,121 గ్రామాలకు రైలు సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీని ద్వారా దాదాపు 52 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తూర్పు, మధ్య భారతదేశంలోని మూడు ప్రాజెక్టులు 14 జిల్లాలను కవర్ చేస్తూ, దాదాపు 56 లక్షల జనాభా ఉన్న 4,790 గ్రామాలను అనుసంధా నిస్తాయి.
ప్రాజెక్టుల వివరాలు ఇలా..
ఈ ఎనిమిది ప్రాజెక్టుల్లో రూ.10,021 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 540 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అరక్కోణం-- రేణిగుంట మూడు, నాలుగో లైన్లు (77 కి.మీ), వైట్‌ఫీల్--బంగారపేట మూడు, నాలు గో లైన్లు (47 కి.మీ), హోసూర్ - ఓమలూర్ డబ్లింగ్ (147 కి.మీ), సేలం - కరూర్ --దిండిగల్ డబ్లింగ్ (159 కి.మీ), సికింద్రాబాద్ (ఘట్కేసర్)- -కాజీపేట మల్టీట్రాకింగ్ (110 కి.మీ). మిగిలిన రూ.10,783 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 656 కిలోమీటర్ల మేర విస్తరిస్తాయి. ఖరగ్‌పూర్ --ఝార్సుగూడ (బాగ్దేహి) నాలుగో లైన్, కట్నీ -పెండ్రా రోడ్ నాలుగో లైన్, బిలాస్పూర్ (ఉస్లాపూర్)-- పెండ్రా రోడ్ మూడో లైన్ ఉన్నాయి.