calender_icon.png 13 September, 2024 | 12:18 AM

నాకు పతి భిక్ష పెట్టండి

11-07-2024 12:27:49 AM

సీఎంకు మహిళ వేడుకోలు

సౌదీలో తన భర్తపై తప్పుడు  కేసులు పెట్టారని ఆవేదన

స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి

జగిత్యాల, జూలై 10 (విజయక్రాంతి): తనకు పతి భిక్ష పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఓ మహిళ వేడుకొన్నది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన కొత్తపెల్లి గంగారెడ్డి గత ఏడాది ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళా డు. వెళ్లిన కొద్ది రోజులకే కంపెనీ నుంచి ఫోన్ చేసి ‘మీ భర్త మతిస్థిమితం సరిగాలేద ని, మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాం’ అని సమాచారం ఇచ్చారని గంగారెడ్డి భార్య జమున తెలిపారు. ఈ నెల 3న గంగారెడ్డి జమునకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహ త్య చేసుకుంటున్నా అని చెప్తూనే గొంతు కోసుకున్నాడని చెప్పారు.

తన భర్తను భారత్‌కు రానివ్వట్లేదని, అక్కడ కంపెనీ కేసుల పాలు చేస్తుందనే భయంతోనే ఆత్మహత్యకు  యత్నిస్తున్నాడని వాపోయింది. ఈ నెల 3న వీడియో కాల్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు తన భర్త నుంచి, కంపెనీ నుంచి ఎలాం టి సమాచారం లేదని ఆందోళన చెందుతున్నారు. తన భర్తను తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తిచేసింది. తన భర్త జగిత్యాలకు చెందిన ఎంఎస్ కార్తీక్ ఇంటర్నేషనల్ దారా సౌదీ వెళ్లాడని.. ఆ కంపెనీని సంప్రదిస్తే పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన భర్తను సౌదీ నుంచి సదేశానికి రప్పించకపోతే తనకు చావే శరణ్యమంటూ కన్నీ రుమున్నీరవుతున్నారు.