అడిగింది ఇచ్చుకో.. ఇష్టం ఉన్నట్టు కట్టుకో!

10-09-2026 | 05:30am
  1. మామూళ్ల మత్తులో రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు? 

అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా.. 

ఓసీలు వచ్చిన వెంటనే అదనపు అంతస్తుల నిర్మాణం చేస్తున్న బిల్డర్లు

అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి చూడని వైనం

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 9(విజయక్రాంతి) : మేము చెప్పిందే చట్టం.. చేసిందే శాసనం నిబంధనలతో పనిలేదు .. అడిగినంత ఇచ్చుకో ఇష్టం ఉన్నట్లు కట్టుకో అంటూ రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ (Rajendranagar Town Planning) అధికారులు భవన అక్రమ నిర్మాణ సంస్థ లకు(Illegal construction company) అభయమిస్తున్నారు .

జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో విచ్చల విడిగా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అటు వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు ఇటీవల అంజయ్య నగర్ లో 50 గజాల్లో 7 అంతస్తుల బారిభవనం నిర్మాణం చేపట్టడం అది కూలి పోవడం తో ప్రాణ నష్టం ఆస్తి నష్టం తో పాటు పక్క భవనాలు శిధిలం అయ్యాయి .

ఈ సంఘటన బేస్ చేసుకొని హైదరాబాద్ జిహెచ్‌ఎంసి పరిధిలో పెద్ద ఎత్తున హైడ్రా జిహెచ్‌ఎంసి సర్కిల్ కార్యాలయ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మరి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు అధికారులకు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కనిపించడం లేదా ..? అసలుకు అక్రమ నిర్మాణాలే లేవ అంత సక్రమమేనా ?అనే విమర్శలు ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నేతలు నుండి వినిపిస్తున్నాయి .

కానరాని సెట్ బ్యాక్

సెట్ బ్యాక్‌లు లేకుండా రోడ్లను కబ్జా చే సి చేపట్టిన నిర్మాణాలు కొన్ని అయితే.. అనుమతులు తీసుకున్న భావనల కంటే అదనం గా నిర్మాణాలు చేపట్టి.. అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా .. ఓసీ లు తీసుకున్న వెంటనే బిల్డర్లు మళ్ళీ అదనంగా అంతస్తులు నిర్మించి ఫ్లాట్ ఫర్ సెల్ అంటూ ఇది చూడు అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణాల ను రాజేంద్ర నగర్ స ర్కిల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో పని చేసే ఒక సాధారణ ఉద్యోగి పేపర్లో వచ్చిన వెంటనే హడావిడిగా అక్కడి వెళ్లి వ సూళ్లకు పాల్పడుతున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. పీరంచెరువు శివారులోని స్నేహి త హిల్స్ లో ఇటీవల అక్ర మ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 

స్నేహిత హిల్స్ ఉన్న దర్గా సమీపంలో ఒక భవనం పై గతం లో 6 వ అంతస్తు నిర్మిస్తుండగా వారం రో జుల క్రితం మీడియాలో వా ర్తలు వచ్చినప్పటికీ లెక్క చెయ్యకుండా బిల్డర్ ఆ పక్కనే ఉన్న మరో భవనం పై ఇటీవల అక్రమంగా మరో అంతస్తు నిర్మాణం చేపట్టాడు. అధికారుల అండదండలు ఆ బిల్డర్ కు లేక పోతే ఇల్లీగల్ గా నిర్మాణాలు కొనసాగుతాయా..? అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తక మానదు..

ఫోన్ లో స్పందించని డిప్యూటీ కమిషనర్... 

అక్రమ భవన నిర్మాణాల పై రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డినీ వివరణ కోరేందుకు ఫోన్ చెయ్యగా ఆయన ఫోన్‌లో అందుబాటు లోకి రాలేదు.

మరిన్ని వార్తలు