బంగారం దిగొచ్చింది.. వెండి కదల్లేదు!
06-10-2026 | 10:17am
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మంగళవారం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో (Bullion Market) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.1,36,600కు చేరింది.అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (24K Gold) రూ.160 తగ్గి రూ.1,49,020 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర (Silver Price) మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.2,45,000గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు (Gold and Silver Rates) అమల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.