19 August, 2026 | 2:02 AM

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

19-08-2026 12:56 AM

దోమకొండ, ఆగస్టు 18 (విజయక్రాంతి): తెలంగాణ వీరుడు, బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దోమకొండ సదర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ సంఘం అధ్యక్షులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. సామాజిక అసమానతలను ఎదుర్కొంటూ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. 

మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, సదర్ కమిటీ  అధ్యక్షుడు తీగల సుదర్శన్ గౌడ్, రాఘవపల్లి ప్రసాద్ గౌడ్, బొంబోతుల రాజనర్సగౌడ్, చింతకింది సత్యనారాయణ గౌడ్,కర్రోళ్ల రామ గౌడ్,,చింతకింది  రాజా గౌడ్, రాఘవపల్లి శ్రీకాంత్ గౌడ్,   కర్రోళ్ల శ్యాం కుమార్ గౌడ్ , కర్రోళ్ల సంపత్ గౌడ్ , రాగుల చంద్ర గౌడ్, రామ గౌడ్ ,యాదగిరి గౌడ్,  రవి గౌడ్, శ్రావణ్ గౌడ్ , దేవేందర్ గౌడ్, యాదగిరి గౌడ్, అశ్వత్ గౌడ్ , తీగల రాజేందర్ గౌడ్ ,భూషణం గౌడ్,లచ్చపేట  స్వామి గౌడ్,  లచ్చపేట నర్సాగౌడ్, బాల గౌడ్, పోతుగోని వెంకట్ గౌడ్, ముత్యం గౌడ్, సత్యం గౌడ్, బోయిన్పల్లి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సాలూర గౌడ సంఘం ఆధ్వర్యంలో 

బోధన్ ఆగస్టు 18 (విజయక్రాంతి): సామాన్యులను సైనికులుగా మార్చి, అన్యాయంపై సమరం చేసిన మహోన్నత శక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సాలూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, డైరెక్టర్ మీసాల లక్ష్మణ్ గౌడ్, సభ్యులు స్వామి గౌడ్, మొగల గౌడ్, సుధీర్ గౌడ్, శేఖర్ గౌడ్, రాజా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల బంధువు పాపన్న ఆశయాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు

లంగ్దాపూర్ గ్రామంలో..

బోధన్, ఆగస్టు 18 (విజయక్రాంతి): బోధన్ మండలం లంగ్దాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి, సామాజిక సమానత్వ భావాలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని, ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రతిభావంతులను అభినందించారు. కార్యక్రమానికి పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ హాజరై విద్యార్థులను అభినందించారు. గ్రామ గౌడస్తులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.