కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

27-09-2026 | 02:39pm

ఆసిఫాబాద్‌ (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ మార్గదర్శకుడు, ప్రముఖ సామాజికవేత్త ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలను ఆదివారం ఆసిఫాబాద్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుండి రోడ్డులోని పద్మశాలి భవన్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం పదవులను సైతం త్యజించి, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిన ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 

మరిన్ని వార్తలు