కొమురవెల్లి పాఠశాలలో హస్తకళ ప్రదర్శనలు

26-09-2026 | 10:07pm

కొమురవెల్లి (విజయక్రాంతి) : ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day) సందర్భంగా కొమరవెల్లి ఉన్నత పాఠశాలలోని(Komaravelli High School) విద్యార్థులకు హస్తకళల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా  చారిత్రక కట్టడాలకు(Historical monuments) సంబంధించిన వాటిని విద్యార్థులు స్వ హస్తాలతో తయారు చేశారు. విద్యార్థులు తయారుచేసిన హస్తకళలను పాఠశాల ఆవరణంలో ప్రదర్శించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రమేష్ మాట్లాడుతూ ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు ఆ కట్టడాలకు సంబంధించిన నేపథ్యం కూడా విద్యార్థులకు అవగాతమవుతుందన్నారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు