మట్టి గణేష్ పెడుతున్నారా?.. హరీష్ రావు 'బంపర్ ఆఫర్'

13-09-2026 | 01:41pm

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) మట్టి గణపతుల ప్రతిమలను(Clay Ganesha idols) పంపిణీ చేశారు. ఏటా 10 వేల మట్టి గణపతులను పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. రసాయనాలతో వినాయకుడిని తయారు చేస్తూ ఊరందరికీ నష్టం జరుగుతుందని అవగాహన కల్పించారు.. మట్టి వినాయకుడిని చేస్తేనే పకృతి, దేవుడికి ఆనందం అన్నారు. మట్టి వినాయకులను పెడతామంటే.. సొంత ఖర్చతో ప్రతి ఊరిలో శాశ్వత షెడ్ ఏర్పాటు చేయిస్తానని హరీశ్ రావు హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు