ఈ మూడేళ్లలో మాపై ఎదురుదాడి: హరీష్ రావు
హైదరాబాద్: ఈ మూడేళ్లలో తమపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగిందని, ఎంక్వైరీలు, కమిషన్లు ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. నిషేధిత జాబితాపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని తేలిందని ఆయన అన్నారు.
“మూడేళ్లుగా మాపై ఎదురుదాడి చేస్తున్నారు. ఎంక్వైరీలు, కమిషన్లు వేశారు. నిషేధిత జాబితాపై సీఎం చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు నిజమని తేలింది” అని హరీశ్ రావు పేర్కొన్నారు. మూడు లక్షల ఎకరాల్లో సమస్య ఉంటే.. అది 30 లక్షల ఎకరాలకు పాకిందని నువ్వే చెప్పావు. ఇదంతా మీ ప్రభుత్వ తప్పిదం కాదా?” అని ఆయన ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తొందరపడి సంతకాలు చేసి వివరాలను అప్లోడ్ చేశారని ప్రభుత్వం చెబుతోందని హరీశ్ రావు అన్నారు. “అలా దబాదబా సంతకాలు చేసిన కలెక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు ప్రభుత్వమే కారణమా కాదా అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.