వీఎన్‌ఆర్ వీఎజేఐఈటీలో హెల్త్ క్యాంపు
మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): బొప్పన శరత్ గోపాల్ ఫౌండేషన్(Boppana Sarath Gopal Foundation), విజ్ఞాన జ్యోతి గ్రూప్ సహకారంతో వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్‌ఆర్ వీఎజేఐఈటీ)లో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి వీఎన్‌ఆర్ వీఎ జేఐఈటీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బం ది నుంచి విశేష స్పందన లభించింది.
ఒకేరోజు 742 మంది రక్తదాతలు 742 యూని ట్ల రక్తాన్ని దానం చేశారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లరి నరేష్ హాజరై వీఎన్‌ఆర్ వీఎజేఐటీ ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు. హైదరాబాద్లో ని శంకర ఐ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరం నాలు గు రోజుల పాటు కొనసాగింది. 4,000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు.