7 September, 2026 | 11:12 AM

కాంగ్రెస్ నేతలను పరామర్శించిన డాక్టర్ మట్టా

07-09-2026 | 09:45am

ఉస్మాన్ అలీ, షేక్ ఇమామ్‌లకు ఆరోగ్యంపై ఆరా

కల్లూరు,సెప్టెంబర్ 06(విజయ క్రాంతి): కల్లూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉస్మాన్ అలీ(Usman Ali) అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Dayanand Vijay Kumar) అదివారం ఆయన నివాసానికి వెళ్లారు. ఉస్మాన్ అలీని కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పట్టణ మాజీ సదర్ షేక్ ఇమామ్ను కూడా కలసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఇరువురూ త్వరగా కోలుకోవాలని డాక్టర్ మట్టా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆళ్ళకుంట నరసింహారావు,తురాబ్ అలీ, వార్డు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు