3 September, 2026 | 10:41 PM

హైదరాబాద్లో భారీ వర్షం

07-06-2024 | 03:16pm

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు విస్తరించాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు కొనసాగుతున్న ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట,ఎర్రగడ్డ, బంజారాహిల్స్,మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది.