3 September, 2026 | 8:54 PM

కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

07-06-2024 | 03:27pm

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. జూన్ 21 వరకు కవిత సీబీఐ జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. కవిత విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.