బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో భారీ వర్షాలు

21-09-2026 | 06:31am

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఈనెల 23,24,25 తేదీల్లో భారీ వర్షాలు(Heavy rains) పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri), రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇండియ‌న్ మెటలాజిక‌ల్ డిపార్ట్మెంట్(India Meteorological Department) వెల్లడించింది.

ఈ నేపథ్యంలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు