మహిళా సంఘం అప్పు తీర్చలేదని..ఇంటి స్థలం స్వాధీనం

19-09-2026 | 12:43pm

మహబూబాబాద్(విజయక్రాంతి): మహిళా సంఘం ద్వారా బ్యాంకు రుణం పొంది తిరిగి తీర్చలేదని సదరు రుణ గ్రహీత మహిళకు చెందిన ఇంటి స్థలాన్ని డ్వాక్రా గ్రూపు(DWCRA group) మహిళా సంఘం ప్రతినిధులు స్వాధీనం చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ నాలుగేళ్ల క్రితం రుణం తీసుకొని వాయిదాలు చెల్లించకుండా ముఖం చాటెయడంతో పాటు గ్రామం వదిలి మరో గ్రామానికి వెళ్లిపోవడంతో తీసుకున్న అప్పు వసూలు కోసం అనేకసార్లు పెరిగిన ఫలితం లేకుండా పోయిందని దీనితో గ్రామంలో ఆమెకు ఉన్న ఇంటి స్థలాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నట్లు గ్రామ మణికంఠ మహిళ సంఘం ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు