విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

08-09-2026 | 04:25am

ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత 

హనుమకొండలో విద్యార్థులతో భారీ ర్యాలీ

మహబూబాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): స్పష్టతలేని ప్రకటనలతో, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చెలగాటమాడుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Rakshana Sena President Kalvakuntla Kavitha) ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ నాయకుడు నడిపెల్లి వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సోమవారం హను మకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. వి ద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.

అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు అనుమతించాలని కోరుతూ కవిత రోడ్డుపై బైఠా యించి నిరసన తెలిపారు. పోలీసుల అనుమతితో విద్యార్థులతో కలిసి కలెక్టర్ చహత్ బాజ్ పాయ్‌కి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని తొలగిస్తామని, మరోసారి పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తామని, ఇంకోవైపు యధావిధిగానే పాలిటెక్నిక్ విద్యా కొనసాగుతుందని ప్రకటిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయి ంబర్స్‌మెంట్ అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు, ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారన్నారు. ఫీజురీయింబర్స్‌మె ంట్ బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు