ఏఐ టెక్నాలజీతో గణేశ్ యాత్రకు హైటెక్ నిఘా
23-09-2026 | 04:51pm
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 25న వేలాది విగ్రహాలు నిమజ్జనం కానున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Police Commissioner Sajjanar) తెలిపారు. ఖైరతాబాద్, బాలాపూర్ శోభాయాత్రలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈసారి నిమజ్జన వేడుకల పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. శోభాయాత్రలు, నిమజ్జన ప్రాంతాలపై నిఘా కోసం 24 డ్రోన్లు, నగరంలోని దాదాపు 10 వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలతో పర్యవేక్షణ చేపడుతున్నారు. నిమజ్జనం కోసం 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సీపీ తెలిపారు.