ఆవిష్కరణలకు హైదరాబాద్ అనుకూలం
పరిష్కారాలు కనుగొనే ఎకోసిస్టం తెలంగాణలో సృష్టించాలి
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌లో రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): భారతదేశాన్ని లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (జీసీసీ) వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా హెల్ ఆర్క్ రూపొందించిన కొత్త ఆలోచనా పత్రాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026(RISE Health Innovation Summit 2026)లో ఆయన పాల్గొన్నారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో వర్చువల్గా, గురువారం ప్రత్యక్షంగా నిర్వహించారు.
మూడు రోజుల కార్యక్రమంలో నోవో నార్డిస్క్, కేర్లాన్ గ్లోబల్ సొల్యూషన్స్, ఒపెల్లా, థర్మో ఫిషర్ సైంటిఫిక్, రోష్, డెలాయిట్, బోష్, మెడ్ట్రానిక్, శాండో జ్, ఫోర్బేస్కేర్, బయోస్టేట్, క్రిస్పర్ బిట్స్, మెడ్జీనోమ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘రైజ్ ఆరోగ్య, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, జీసీసీలు, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకు చెందిన కీలక నాయకులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ పాత్ర గణనీయంగా మారుతున్న ఈ సమయంలో ఇది జరుగుతుండటం మరింత ప్రాధాన్యత కలిగిన విషయం.
ఈ తదుపరి దశకు హైదరాబాద్ ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. బలమైన లైఫ్ సైన్సె స్ ఎకోసిస్టమ్, లోతైన సాంకేతిక మరియు ఇంజినీరింగ్ ప్రతిభ, అలాగే పరస్పరం అనుసంధానమవుతున్న ఆవిష్కరణల వాతావరణం హైదరాబాద్కు ఉన్నాయి. ఈ బలాలను ఒకచోట చేర్చి, శాస్త్రం, సాంకేతికత, ప్రతిభ, పరిశ్రమలు కలిసి వాస్తవ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ఎకోసిస్టమ్ను తెలంగాణలో సృష్టించడం మన ముందున్న అవకాశం’ అని అన్నారు.
కాగా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ జీసీసీలకు భారతదేశాన్ని వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దడం అనే సంక ల్పంతో హెల్త్ ఆర్క్ రూపొందించిన ప్రచురణలో భారత్‌లో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ జీసీసీల అభివృద్ధి, రెగ్యులేటరీ అఫైర్స్, క్లినికల్ డెవలప్మెంట్, మెడికల్ అఫైర్స్, క్వాలిటీ, అనలిటిక్స్, డిజిటల్, ఏఐ వంటి అధునాతన సామర్థ్యాల నిర్మాణంపై వివరించారు. కార్యక్రమంలో హెల్త్ ఆర్క్ వ్యవస్థాపకుడు, సీఈవో పురవ్ గాంధీ మాట్లాడుతూ.. జీసీసీలపై చర్చ కేవలం భారత్‌కు మరిన్ని పనులు తరలించడానికే పరిమితం కాకుండా, ఇక్కడ అధిక విలువ కలిగిన సామర్థ్యాలను నిర్మించడం, గ్లోబల్ బాధ్యతలు చేపట్టగల బృందాలను అభివృద్ధి చేయడం వైపు మారుతోందన్నారు.
కార్యక్రమంలో హెల్ ఆర్క్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ సుదీప్ కృష్ణ, నోవో నార్డీస్క్ ఇండియా జీసీసీ మేనేజిం గ్ డైరెక్టర్ జాన్ డాబర్, రోష్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్, ఇండియా జనరల్ మేనేజర్ నిల య్ శాస్త్రి, ఒపెల్లా జీసీసీ స్ట్రాటజీ అండ్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ చాందని పాల్షేత్కర్, ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ జీవీ రావు, హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, పరిశోధన పాల్గొన్నారు. ఏఐ, అనలిటిక్స్, ఇంజినీరింగ్, జెనోమిక్స్, బయోటెక్నాలజీ రంగాలను ఉపయోగించి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయగల ప్రభావంగా ఎలా మార్చాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.