విక్టరీ లగ్జరీ లిమోసిన్‌కు హ్యుండాయ్ కార్లు

27-09-2026 | 05:05am

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భారత్ హ్యుండాయ్, గౌలిదొడ్డి, హై దరాబాద్ ఆధ్వర్యంలో విక్టరీ లగ్జరీ లిమోసిన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(Victory Luxury Limousine Logistics Private Limited) 50 హ్యుండాయ్ ప్రైమ్ ఎస్డీ ఫ్లీట్ కార్లను అం దించారు. ఉద్యోగుల రవాణా అవసరాల కో సం ఈ వాహనాలను సంస్థ ఎంపిక చేసుకుంది. ఈ సందర్భంగా విక్టరీ లగ్జరీ లిమో సిన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జహంగీర్ హాది ముఖ్య అతిథిగా హా జరయ్యారు.

సౌత్ రీజినల్ 2 మేనేజర్ అమి త్ కుమార్ సింగ్, సౌత్ రీజినల్ 2 సర్వీస్ హెడ్ మనోజ్ బాతం గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. భారత్ హ్యుందాయ్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ కేసా శ్రీకాంత్, సీఈవో షాయన్ కృష్ణ, జనరల్ మేనేజర్ ఎం. శ్రీకాంత్ పాల్గొన్నారు. భారత్ హ్యుందాయ్  గౌలిదొడ్డి వద్ద ఈ ప్రత్యేక డెలివరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మల్టీనేష నల్, టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల రవాణా కోసం సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన, పర్యావరణ పరిరక్షణకు అనుకూలమై న రవాణా పరిష్కారాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఫ్లీట్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోందని సంస్థ తెలిపింది. కార్యక్ర మంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు