అక్రమ అరెస్టులు ఆపాలి

10-09-2026 | 12:44am

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జనసేన పార్టీ(Janasena Party) నాయకులు కందుల రాజి రెడ్డి ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర అధ్యక్షులు నేమురి శంకరన్న అక్రమ అరెస్టులకు నిరసనగా కరీంనగర్(Karimnagar)లోని తెలంగాణ చౌక్ గీతా భవన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా రాజి రెడ్డి మాట్లాడుతూ అక్రమ అరెస్టులు ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇబ్బంది కలిగి అనేక సమస్యలు ఉండగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అక్రమ అరెస్టు లు చేస్తున్నారని 22 ఏ జీవో ఎత్తివేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు(Fee reimbursement dues) చెల్లించకుండా ప్రజల దృష్టిని మరలించడానికి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఇలాంటి చర్యలు తగదని ఈ అరెస్టులు ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఉద్యమం చేపడతామని తెలంగాణ గురించి ఏ విధంగా కొట్లాడినమో కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దతించేందుకు కూడా అదే విధంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

  1. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి 22a భూములను పరిష్కరించే విధంగా అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఉద్యమం చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మొగిలిపాలెం రమేష్. కరీంనగర్ మున్సిపల్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థులు, పొన్నాల తిరుపతి, వీర్ల శ్రీనివాసరావు, అంబాల సృజన్ కుమార్, జంగ మహేష్, జనసేన నాయకులు మహాదేవుని రాజ్ కుమార్ గాలిపెల్లి కుమార్, పాతూరి వేణుగోపాల్ రెడ్డి తరుణ్, వికాస్, ప్రవీణ్, పవన్ జనసేన వీర మహిళలు తోడేటి భారతి కుంట సుజాత గుండా శకుంతల. నేరెళ్ల సరోజన ఇంకా జనసైనికులు వీర మహిళలు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు