వెయ్యిరోజుల్లో గుండాయిజాన్ని, గంజాయిని పెంచిపోషించారు

10-09-2026 | 05:10am
  1. ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే

ఎన్నికల హామీలను నెరవేర్చాలి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

ఎమ్మెల్యే పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల

మంచిర్యాల, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి) : వెయ్యి రోజుల పాలనలో ఎంఎల్‌ఏ పీఎస్‌ఆర్ చేసింది ఏదయినా ఉందా అంటే గంజాయిని ప్రోత్సహించడం, గూడాజియం, రౌడీయిజం, బెదిరింపులు వంటివి చేశారే తప్ప ప్రజలకు నయా పైసా ఉపయోగపడలేదు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ (BJP State Vice-President Raghunath) వెరబెల్లి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధ వారం ఎమ్మెల్యే 1000 రోజుల పాలన వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఇన్ని రోజులు గంజాయి బ్యాచ్‌లను ప్రోత్సహించి ఇప్పుడు గంజాయి గురించి ఎంఎల్‌ఏ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంచిర్యాల ప్రజల సొమ్ము దోచుకుని రూ. 470 కోట్ల అప్పు కట్టి, కాంట్రాక్టర్ ల వద్ద నుంచి కమీషన్లు దోచుకోవడం, భూ ఖబ్జాలు, భూ సెటిల్మెంట్ లు చేసి డబ్బు సంపాదించడం తప్ప చేసింది ఏమి లేదన్నారు.

22ఏ లో ప్రజల వేల నివాస భూములు, లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే ఎంఎల్‌ఏ మాత్రం ఒక్క గజం భూమి ఉన్నా రాజీనామా చేస్తాననడం హాస్యాస్పదం అని అన్నారు. నియోజక వర్గ ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసిన ఎమ్మెల్యే ఇప్పటికైనా ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, గోలి రాము, పట్టి వెంకట కృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, పచ్చ స్వప్న రాణి, డేగ బాపు, కస్తూరి నాగరాజు, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, కర్రె లచ్చన్న, రాకేష్ రెన్వ, జయరామ రావు, నాంపల్లి శ్రీనివాస్, అవిడపు రాజబాబు, ముదాం మల్లేష్, బల్జపల్లి తిరుపతి, బద్రి శ్రీకాంత్, నల్ల రవి, ఆడెపు కుమార స్వామి,  పవన్, రవీందర్, మహేందర్, నల్లపు రమేష్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు