క్రాంతిగౌడపై అనుచిత వ్యాఖ్యలు

08-09-2026 | 05:25am
  1. పాక్ ఫాన్స్ కండకావరం 
  2. బౌండరీ దగ్గర వేధింపులు
  3. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్

దుబాయి, సెప్టెంబర్ 7 : మహిళల ఆసియా కప్(Womens Asian Cup) 2026 టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్(Pakistan) మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్(Kranthi Goud) పట్ల పాకిస్థాన్ అభిమానులు అత్యంత దారుణంగా, అసభ్యకరంగా ప్రవర్తించారు. బౌండరీ లైన్ వద్ద క్రాంతి గౌడ్ ఫీల్డింగ్ చేస్తుండగా గ్యాలరీలోని పాక్ ఫ్యాన్స్ ఆమె రూపాన్ని ఉద్దేశించి లైంగిక(Sexual), లింగ వివక్షతో(Gender discrimination) కూడిన వ్యాఖ్యలు  చేశారు. క్రాంతి గౌడ్ అమ్మాయి కాదంటూ అబ్బాయి ఆడుతున్నాడు.. ఒరేయ్ అబ్బా య్ ఇటు రా అంటూ పాక్ అభిమానులు రాయలేని పదాలతో హేళన చేశారు.

భారత జట్టు(Indian team) మోసపూరితంగా మ్యాచ్‌లు(Matches) గెలుస్తోందంటూ కొందరు ప్రేక్షకులు అరిచారు. చుట్టుపక్కల ఉన్న మరికొందరు పాక్ అభిమానులు దీనిని ఖండించాల్సింది పోయి నవ్వు తూ ఎంజాయ్ చేశారు. పాక్ ఫ్యాన్స్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసినప్పటికీ, క్రాంతి గౌడ్ ఏమాత్రం సహనం కో ల్పోలేదు. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా, పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టి ఎంతో పరిణతి కనబరిచింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్  (ట్విట్టర్)లో వైరల్ కావడంతో క్రీడా ప్రపంచం తీవ్రంగా స్పం దిం చింది. క్రీడల్లో మహిళా అథ్లెట్లపై ఇలాం టి లింగ వివక్ష వ్యాఖ్యలు చేయడం అత్యంత విచారకరమని, సదరు అభిమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు