శ్మశాన వాటికలో గ్రానైట్ స్టోన్ స్టేడియం సీటింగ్ షెడ్ ప్రారంభం
- పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్,
ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ బోర్డు ఉపాధ్యక్షులు
జంపన ప్రతాప్, జక్కల మహేశ్వర్ రెడ్డి, సదా కేశవ రెడ్డి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): న్యూ బోయిన్పల్లి చిన్న తోకట్ట లోని జి.ఎం. అంజయ్య మెమోరియల్ (G.M. Anjaiah Memorial) హిందూ శ్మశాన వాటికలో నూతనంగా నిర్మించిన గ్రా నైట్ స్టోన్ స్టేడియం సీటింగ్ షెడ్’ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణే ష్, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని ప్రారంభించారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవ రెడ్డి,జంపన ప్రతాప్, జక్కుల మహేశ్వర్ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.జి.ఎం. అంజ య్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికలో కాంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపా ధ్యక్షులు సదా కేశవ రెడ్డి ఈ నూతన గ్రానైట్ స్టోన్ స్టేడియం సీటింగ్ షెడ్ను సొంత ఖర్చులతో నిర్మించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈ టల రాజేందర్ మాట్లాడుతూచిన్నప్పుడు చ దువుకునే రోజుల్లో జి.ఎం. అంజయ్య, గుడిసెల వెంకటస్వామి వంటి పెద్దల పేర్లు వినే వాడిని.
పేదల కోసం ఇంత గొప్పగా కృషి చేసిన జి.ఎం. అంజయ్య పేరు మీద ఉన్న శ్మ శాన వాటికలో సదా కేశవ రెడ్డి నూతన సీ టింగ్ షెడ్ను నిర్మించడం ఎంతో అభినందనీయం. మనిషికి ఎంత సంపద ఉందన్నది కాదు, సమాజంలో ఎంత గౌరవం ఉందనేదే ముఖ్యం.నేను ఎంపీ అయిన తర్వాత ఇక్కడి సెంట్రల్ లైటింగ్, స్మశాన వాటికల అభివృ ద్ధి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం నిధు లు కేటాయించాను.2015లో కంటోన్మెంట్ ఎన్నికల ఇంఛార్జిగా నేను వచ్చినప్పుడు కేశవరెడ్డి పార్టీలో చేరారు.
పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఆయన ప్రజా సమస్యలను చూసి ఎంతగానో పరిణతి చెందారు. ప్రజా సేవలో నిమ గ్నమైన వారికి ప్రజల గుండెల్లో నిరంతరం స్థానం ఉంటుంది. సదా కేశవరెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి సేవలు మరిన్ని కొనసా గించాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నా ను. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండల్ యాదవ్,బీజేపీ నాయకుడు పిట్ల నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.