ఆసీస్ ఏపై భారత్ ఏ బౌలర్ల జోరు

24-09-2026 | 05:00am

171 పరుగులకే కంగారూలు ఆలౌట్ 

పుదుచ్చేరి, సెప్టెంబర్ 23: ఆస్ట్రేలియా ఏ జట్టు(Australia A team)తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌(Test match)లో భారత్ ఏ బౌలర్లు(India A bowlers) అదరగొట్టారు. కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆసీస్ ఏ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 ప రుగులే చేసి ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌(India's first innings)లో 117.3 ఓవర్లు ఆడి 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (57), ఆల్‌రౌండర్ తనుశ్  కొటియాన్ (69) అర్ధ శతకాలు బాదగా, బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా కుమార్ కుశాగ్రా శతకం పూర్తి చేసుకున్నాడు.

మొత్తంగా 240 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 12 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కేవలం జేసన్ సంగా మాత్రమే కాస్త నిలకడగా ఆడాడు. 

వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ (14) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరగా, ఆల్‌రౌండర్ లియామ్ స్కాట్ 26 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వారిలో ఫెర్గూస్ 13, టాడ్ మర్ఫీ 12, బ్రెండన్ డాగెట్ 13 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమ్స్ ములానీ 4 వికెట్లతో ఆసీస్ న డుము విరవగా, తనుష్ కోటియన్ 2 వికెట్లు తీశారు. టీమిండియాకు 163 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

మరిన్ని వార్తలు