భారత్ సంచలనం.. మెడల్ కన్ఫర్మ్
నాగోయా, అక్టోబర్ 1: ఆసియా గేమ్స్ 2026లో(Sepaktakraw Asian Games 2026) భారత్ మరో పతకానికి చేరువైంది. పురుషుల సెపక్‌తక్రా క్వాడ్రంట్( India Sepaktakraw) విభాగంలో భారత జట్టు సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గ్రూప్-Aలో వరుస విజయాలతో అజేయంగా నిలిచిన భారత్.. తాజాగా మయన్మార్‌పై(India vs Myanmar Sepaktakraw) ఉత్కంఠభరిత పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 10-15తో కోల్పోయిన భారత్, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. రెండో గేమ్‌లో 15-13తో ఆధిక్యం సాధించి పోరును సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత ఆటగాళ్లు మరింత దూకుడు ప్రదర్శించి 15-7తో గెలుపొందారు. దీంతో 2-1తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్(Sepaktakraw Semifinal) బెర్త్ ఖాయం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: ఇషాన్ వీరబాదుడు.. భారత్ అదిరే స్కోర్!
అంతకుముందు గ్రూప్ దశలో భారత్ లావోస్, వియత్నాంపై విజయాలు నమోదు చేసింది. వియత్నాంపై జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0తో గెలిచింది. ఆ పోరులో భారత జట్టు 15-12, 15-9తో ప్రత్యర్థిని వరుస గేముల్లో మట్టికరిపించింది. మయన్మార్‌పై గెలుపుతో గ్రూప్-Aలో అజేయంగా నిలిచిన భారత్, ఇప్పుడు సెమీఫైనల్‌లో పతకం( India Medal ) కోసం బరిలోకి దిగనుంది. మరోవైపు గ్రూప్-Bలో ఇండోనేషియా అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే భారత ఖాతాలో మరో ఆసియా గేమ్స్ పతకం చేరే అవకాశం ఉంది.