15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

రూ. 6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

25-01-2026 12:34 AM
  1. మేడారం జాతరకు వచ్చే భక్తులకు నిత్యావసర వస్తువుల విక్రయం 
  2. మంత్రి సీతక్క చొరవతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు లబ్ధి

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : మహిళా అభ్యున్నతికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్థిక చేకూర్పుకు అవకాశంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించుటకు  ఇందిరా మహిళా శక్తి ద్వారా రూ. 6 కోట్ల వ్యయంతో 565 షాపులను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది.

మొత్తం 37 లొకేషన్లలో 27 రకాల వ్యాపారాలను మహిళలు నిర్వహించనున్నారు. అందులో మేడా రం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్లు, మేడారం రాక పోకలు జరిగే మార్గంలో 63 యూనిట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన యూనిట్లు ఇతర చోట్ల నెలకొల్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెర్ప్ బ్యాంక్ లింకేజ్ రూ. 341.30 లక్షలతో 315 యూనిట్లు, సెర్ప్ సీఐఎఫ్ నిధులు రూ. 86.50 కోట్లతో 80 యూనిట్లు, స్త్రీనిధి రూ. 92 లక్షలతో 90 యూనిట్లు, మండల సమా ఖ్య సీఐఎఫ్ రూ. 64 లక్షలతో 60 యూ నిట్లు, గ్రామ సమాఖ్య నిధులు రూ. 19.50 లక్షలతో 20 యూనిట్లను ప్రభుత్వం మం జూరు చేసింది. రాష్ట పంచాయతీ రాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో మేడారం జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ ద్వారా ఈ ప్రాంత సంఘాల మహిళలు లబ్ధి పొందనున్నారు.

ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇప్ప పువ్వు లడ్డులు, మిల్లెట్ లడ్డులు, రాగి లడ్డులు, పల్లీ లడ్డులు విక్రయ స్టాల్స్, ఇప్ప నూనె, కోల్డ్ ప్రెస్ ఆయి ల్, కారం, పసుపు, మసాలా యూనిట్స్, రాగి జావ/టిఫిన్, రొట్టెల యూనిట్, మిల్లెట్ షేక్, స్వీట్ కార్న్, పాప్ కార్న్, టీ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు, పూజా సామాగ్రీ విక్రయ స్టాల్స్‌తో పాటు బేకరీ, బ్యాంబు చికెన్, చికెన్, క్లాత్ రెడీ మేడ్  డ్రెస్సెస్, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహర, కిరా ణా జనరల్ స్టోర్, కూల్ డ్రింక్స్, పాలు, ఫాస్ట్ ఫుడ్, మొబైల్ ఫిష్ అండ్ కర్రీ అవుట్ లెట్, కోళ్ల విక్రయ అవుట్ లెట్, కోడి గుడ్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నాయి. మహిళల ఆర్ధిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుంది.