7 September, 2026 | 7:18 AM

ఇక్కడ నేనే బాస్... నేను చెప్పిందే వేదం!

07-09-2026 | 05:15am
  1. వింటే సరి లేదంటే నరకం చూపిస్తా!
  2. ఇక్కడ నేనే బాస్....చెప్పే వారు పుట్టలేదట
  3. దిక్కున్న చోట చెప్పుకోండి.. ఎవరేం చేస్తారో నేను చూసుకుంటా 
  4. ప్రభుత్వాలు మారిన నాదే పెత్తనం 
  5. పిర్యాదు చేస్తే వారిని టార్గెట్ చేస్తారంట.. మెప్మాలో ఇదేంటీ?

మహబూబ్‌నగర్ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఇక్కడ నేను చెప్పింది ఏదైనా వింటే సరి... లేదంటే మీకు నరకం చూపిస్తా.. ఇక్కడ నేనే కింగ్ కాదంటే మీకు పుట్టగతుల్లేకుండా చేస్తా.... నన్ను ఎదిరించడం మీ తరం కాదు కాబట్టి నా మాట మేరకు నడుచుకోవాల్సిందే...

ఇక నన్ను కాదంటే నా తరుపున అనేక మంది మహిళలు ముందుకు వచ్చి మీ అంతు చూస్తారు.. ఏ ప్రభుత్వం వచ్చినా వారికి నేను చెప్పిందే వేదం.. చూస్తున్నారు కదా ప్రతి మీటింగ్ లో వారికి నేను ఇచ్చిందే సమాచారం... చెప్పిందే వేదం అంటూ మెప్మా(MEPMA)లో పనిచేసే మహిళా ఉద్యోగిణులను భయబ్రాంతులకు గురిచేస్తూ.. మెప్మాలో ఓ ఉద్యోగి తోటి మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తోన్నా తీరు ఇది... ఇక వారి పై ఎవ్వరైనా పిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోన్నా విషయాన్ని కొంతమంది బాధిత మహిళ ఉద్యోగిణులు విజయక్రాంతిని ఆశ్రయించి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ బోరున విలపించారు. వివరాల్లోకి వెళ్లితే.. 

అంచలంచలుగా ఎదుగుతున్న నగరంలో ఇదేంటీ...

పాలమూర్ మున్సిపాలిటీ(Palamoor Municipality) అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కార్పోరేషన్ స్థాయికి ఎదిగింది. కాగా మెప్మాలో పనిచేస్తోన్నా మహిళా ఉద్యోగులకు మాత్రం స్వేచ్చ లేకుండా బలవుతోన్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. పాలమూర్ కార్పోరేషన్లో మొత్తం 3187 మహిళా సంఘాలుండగా, వీటిలో 31,487 మంది మహిళా సభ్యులున్నారు.

ఇక వీటితో 100స్లమ్ లెవల్ ఫెడరేషన్ లు, రెండు పట్టణ లెవల్ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాల్ని అధికారులు వేగవంతం చేస్తుండ్రు.  వీటిని పర్యేవేక్షించేందుకు మెప్మా డిఎంసి పోస్ట్ ఒక్కరు, టీఎంసిగా ఒక్కరితో పాటు, కమ్యూనిటీ ఆర్గనైజర్లుగా 4 పనిచేస్తున్నారు. మెప్మాలో ఒకరు మహిళాల పట్ల నిత్యం చేస్తోన్నా ఆరాచకాలు మితిమీరిపోతున్నాయని బాదితులు చెబుతున్నారు. వారిని ఎవ్వరు ఎదిరించలేరంట, ఆ సాహసం చెయ్యలేక  లొంగి బానిస బ్రతుకుల్ని అనుభవిస్తున్నారట.

ఎందుకంటే ఆ వ్యక్తి కి ఉన్న రాజకీయ పలుకుబడిని మహిళా ఉద్యోగుల పట్ల ఉపయోగిస్తూ, వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాదిత మహిళలు చెబుతున్నారు. ఈ విషయమై పై అధికారులకు కానీ ఎమ్మెల్యేకు గాని పిర్యాదు చేసేందుకు వెళ్ళితే వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడడమే కాకుండా, వారిపై నానా రకాల నిందలు మోపి వారిని మానసికంగా కృంగదీసి ఉద్యోగం నుండి తప్పింప జేస్తాడట. ఇలాంటి ఘటనలు చాలా జరిగినట్లు బాదితులు చెబుతున్నారు.

ఇక్కడ నేనే బాస్: మెప్మాలో పనిచేస్తోన్నా ఆ ఉద్యోగి కొన్నేడ్లుగా పాతుకుపోవడంతో ఇక్కడ నేనే బాస్ ని అంటూ చెలరేగిపోతున్నాడట. ఎందుకంటే కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా వారికి నేను చెప్పిన సమాచారమే వేదమని ప్రతి మీటింగ్లో అదే తీరుగా వారికి లేనిపోని సమాచారం ఇచ్చి ఏ ఒక్కరిని మాట్లాడనివ్వకుండా వ్యవహరించి మహిళా లను భయబ్రాంతులకు గురిచేస్తాడట.

ఇక ప్ ఉన్నా మెప్మా పీడి ఎవరు ఉన్నా వారి పై రక రకాలుగా పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని సైతం డమ్మీ చేసి పెత్తానం చెలాయిస్తున్నాడని బాదితులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ పరంగా ఏదైనా సమావేశాన్ని పెడితే వారి హడావిడి అంతా ఇంతా కాదట. అందరిపై నోరు పెద్దగా చేసి తానే ఆ సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించినట్లు ముద్రవేసుకొంటాడట. కాగా వాస్తవాన్నికి ఫీల్ లెవాల్లో పనిచేసిన మహిళా ఉద్యోగులు, మహిళలు ఆ వ్యక్తికి ఎదురు చెప్పని దుస్థితిని అనుభవిస్తున్నారట.

మహిళా సంఘాలతో పనిచేసేందుకు మహిళాలనే నియమించాలని ప్రస్తుతం ఉన్నా గురి చేస్తున్న ఆ వ్యక్తి పై పూర్తి విచారణ చేసి తొలగించి మహిళలకే అవకాశం కల్పించాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. వారికి అనుకూలంగా ఉన్నా ఓ పత్రికలో వ్రాయించుకొని అందర్ని భయబ్రాంతులకు గురిచేస్తాడట. ఈ విధానం ఏళ్లుగా నడుస్తోన్నా పట్టించుకొనే వారే కరువయ్యారని బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న ఆరాచకాలను విజయక్రాంతి శీర్షిక రూపంలో మీముందుకు తీసుకొస్తోంది.

మరిన్ని వార్తలు