గోవాలో ఐపీఎల్ మినీ వేలం
డిసెంబర్ 15, 16న జరిగే ఛాన్స్
ముంబై, సెప్టెంబర్ 23: ఐపీఎల్ ఫ్రాంచైజీలు(IPL franchises) ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ వేలం వేదికపై స్పష్టత వచ్చింది. ఊహించినట్టుగానే ఈ సారి ఐపీఎల్ వేలాన్ని(IPL Auction) స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా(Board Secretary Devajit Saikia), ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరులో గోవా వేది కగా ఐపీఎల్ 2027 వేలం నిర్వహించనున్న ట్లు సైకియా చెప్పారు. గత మూడేళ్లుగా విదేశాల్లోనే ఐపీఎల్ వేలం జరిగిందనీ, సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబీ(Saudi Arabia, Dubai, Abu Dhabi) వంటి అంతర్జాతీయ వేదికల మీద ఆక్షన్ నిర్వహిం చామని గుర్తు చేశారు.
ఈసారి డిసెంబర్ 15,16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉం ద ని తెలుస్తోంది. మరోవైపు భారత్--ఎ, ఆస్ట్రేలియా--ఎ మహిళల మధ్య జరగాల్సిన మ్యా చ్ వేదిక మారింది. సెప్టెంబర్ 29 నుంచి అ క్టోబర్ 2 వరకు ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను మొహాలీకి తరలించారు. భారీ వ ర్షాలతో ధర్మశాల మైదానం అవుట్ ఫీల్డ్ దెబ్బతినడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.