జాతీయ స్థాయి థాంగ్-టా పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): జాతీయ స్థాయి థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ పోటీల(National level Thang-Ta martial arts competitions)కు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల(Indian Public School)కు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐపీఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఏ. అద్వైత్ 56 కేజీల విభాగంలో, ఎం. సంప్రీత్ 46 కేజీల విభాగంలో, కె. మైత్రి వరుణ్ 52 కేజీల విభాగంలో టి.ధనుష్‌కుమార్ 56 కేజీల విభాగంలో ఎంపికయ్యారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను(Students ) పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్‌కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాలలో విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. శ్రీనగర్‌లో జరిగే జాతీయ పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సునీత, మేనేజర్ శివ, వ్యాయామఉపాధ్యాయులు సత్యనారాయణ, సతీష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.