చిట్యాల సివిల్ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి

22-09-2026 | 06:14pm

డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్

డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేత 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆసుపత్రి(Civil Hospital)లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీవైఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి భూక్య నవీన్(DYFI District Secretary Bhukya Naveen) అన్నారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ చిట్యాల సివిల్ ఆసుపత్రికి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని ఆసుపత్రిలో కనీస సౌకర్యాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని గత ఆరు నెలలుగా వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఆసుపత్రిని పరిశీలించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు