అంతా డైవర్షన్ పాలిటిక్స్

10-09-2026 | 05:35am

అసెంబ్లీలో ఫీజు బకాయిలపై ప్రత్యేక చర్చ జరపాలి

బీజేపీ రాష్ట్ర చీఫ్ 

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గవర్నర్‌కు వినతిపత్రం

హైదరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) డైవర్షన్ పాలిటిక్స్(Diversionary Politics) చేస్తున్నాయని.. అసెంబ్లీ(Assembly)లో కనీసం ఒక రోజైనా ఫీజు బకాయిల(Fee arrears)పై ప్రత్యేక చర్చ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(BJP State President N. Ramchander Rao) డిమాండ్ చేశారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాంచందర్‌రావు నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాని(Shiv Pratap Shukla) కలిసి వినతిపత్రం సమపర్పించింది.

అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ పాలన నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వరకు విద్యార్థులు(Students) రీయింబర్స్‌మెంట్ బకా యిల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆం దోళనలో ఉన్నారని తెలిపారు. హైకోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు బీజేపీ చేపట్టిన నిరంతర ఆందోళనలు, నిరసన కార్యక్రమాల వల్లే ఈ విద్యాసంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థులకు నామమాత్రంగా అయినా నిధులు మంజూరయ్యా యని, అయితే దాదాపు రూ. 15,000 కోట్ల పాత బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందక వారి భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

విద్యా వ్యవస్థను కాపాడేందుకు ఫీజు బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తి డి తేవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై రాంచందర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీలో బకాయిల అంశంపై చర్చ జరగకుండా ప్రజలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే కాంగ్రె స్ ప్రభుత్వం లాఠీఛార్జీలు, ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు బనాయిన్నారని రాంచందర్‌రావు విమర్శించారు.

నిన్నటి ఆందోళనలో పోలీసుల దాడి వల్ల తీవ్రంగా గాయపడి పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స పొం దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యక ర్తలపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కో సం కొన్ని రోజులు వేచి చూస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శులు డా. ఎన్ గౌతమ్ రావు, టీ వీరేందర్ గౌడ్, వేముల అశోక్, పార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షులు జయశ్రీ, డా. కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, భరత్ ప్రసా ద్, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు