పెండింగ్‌ ప్రాజెక్టుల సాధనకు పాదయాత్ర

25-09-2026 | 02:10pm

అలంపూర్, సెప్టెంబర్‌ 25:(విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసి  రైతులకు న్యాయం చేయాలని అలంపూర్‌ తాలూకా జేఏసీ చైర్మన్‌ వై.రామ్మోహన్‌(JAC Chairman Y. Rammohan) డిమాండ్‌ చేశారు.ఈ నెల 27న ఉల్ఫర నుంచి కల్వకుర్తి వరకు నిర్వహించే పాదయాత్ర కరపత్రాన్ని శుక్రవారం అలంపూర్‌ చౌరస్తాలో ఆవిష్కరించారు.

జూరాల నుంచి ఉండవెల్లి, మానోపాడు, అలంపూర్‌ మండలాలకు సాగునీరు విడుదల చేయాలని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, గొంగళ్ల ఈశ్వర్‌, శేషన్‌గౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు