25 March, 2026 | 5:47 PM

Breaking News

ఇప్పపువ్వు సారా లాభాలు... అసెంబ్లీలో వివరించిన జడ్చర్ల ఎమ్మెల్యే

25-03-2026 04:10 PM

ఇప్పపువ్వుతో డయాబెటిస్ కంట్రోల్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcherla Congress MLA Anirudh Reddy) ఇప్పపువ్వు సారా వల్ల కలిగే లాభాలపై మాట్లాడారు. ఇప్పపువ్వుపై బ్రిటీష్ వాళ్లు బ్యాన్ విధించారని, ఇప్పపువ్వు(Mahua Flower) లిక్కర్ తయారీ, ఎగుమతిని నిషేధించారని వెల్లడించారు. ఇప్పపువ్వుతో ఇస్ క్రీమ్, లిక్కర్, కేక్, లడ్డూ చేయొచ్చని వివరించారు. ఇప్ప పువ్వును టీలో(Mahua Flower Tea) వేసుకుని తాగితే డయాబెటిస్ కంట్రోల్(Diabetes Control) అవుతుందన్నారు. 


ఇప్పచెట్టుకు ఐదు వేల ఏల్ల చరిత్ర ఉందని అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) స్పష్టం చేశారు. ఇప్ప పువ్వుతో తయారయ్యే లిక్కర్ మంచిదని పెద్ద చెప్తున్నారు. ఇప్ప పువ్వుతో లిక్కర్ తయారుచేసి ఎగుమతి చేస్తే ఆదివాసీలకు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో సారా తాగిన వాళ్లు 115 సంవత్సరాలు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే మరణిస్తున్నారని వెల్లడించారు. ఇంతకు సారా దుకాణాలు ఎందుకు మూసివేశారో  అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అంశంపై ప్రస్తావించి, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని అసెంబ్లీలో అడుగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నాడు ఇప్పపువ్వుపై ప్రస్తావించారు.