25 August, 2026 | 5:16 PM

పూల్ క్యాంపస్ డ్రైవ్‌లో 42 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

25-08-2026 04:27 PM

ఘట్ కేసర్, ఆగస్టు 25(విజయక్రాంతి): సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో పూల్ క్యాంపస్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో  18 ఫార్మసీ కళాశాలలకు చెందిన 136 మంది విద్యార్థులు పాల్గొన్నారు. హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, రెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇనోవైన్ సైంటిఫిక్ మీటింగ్స్ అనే మూడు ప్రముఖ కంపెనీలు ఈ నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి. వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం మొత్తం 42 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికై ఆఫర్ లెటర్లు పొందారు. ఎంపికైన విద్యార్థులను సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ ఎ.వి. రమణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. నరసింహారావు, ఇన్‌చార్జ్ డాక్టర్ శివ కేశవరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వాతి, టిపిఓ, హెచ్ఓడి లు, కళాశాల అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులకు మంచి కెరీర్ అవకాశాలు కల్పించినందుకు కంపెనీల ప్రతినిధులకు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందించేందుకు కళాశాల కట్టుబడి ఉందని తెలిపారు