అక్రిడిటేషన్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి

01-10-2026 | 10:46pm

జనగామ,(విజయక్రాంతి): అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ(accredited journalists) ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు(Health Cards) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జాల రమేష్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ(State President Allam Narayana), ప్రధాన కార్యదర్శి అస్కని మారుతీ సాగర్ పిలుపు మేరకు రేపు అక్టోబర్ 2న ఉదయం 11 గంటలకు జనగామలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి జర్నలిస్టు తమ డిమాండ్లను పోస్ట్ కార్డుపై రాసి సీఎం రేవంత్ రెడ్డికి పంపాలని కోరారు. ప్రతి మండలం, పట్టణం, జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు ఈ న్యాయపరమైన పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు